ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన ‘చప్పన్ భోగ్’ అనే స్వీట్ షాప్ ఖరీదైన స్వీట్‌ను పరిచయం చేసింది. ఈ స్వీట్ పేరు ‘ఎక్సోటికా’. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన గింజలు, ఎండిన పండ్లతో ఈ స్వీట్‌ను తయారు చేస్తారు. ఆ స్వీట్ పొరను 24 క్యారెట్ల బంగారంతో అలంకరిస్తారు. ఈ స్వీట్ బాక్స్ ధర రూ.50 వేలు ఉంటుంది. ఇందులో దాదాపు 100 పీసుల స్వీట్లు ఉంటుంది.