ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి ఇంచార్జ్ ముత్తముల అశోక్ రెడ్డిని శనివారం గిద్దలూరు పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు దేవి నవరాత్రులకు ఆహ్వానం అందించారు. గిద్దలూరు టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డిని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వారు ఆహ్వాన పత్రిక అందజేశారు.