టీడీపీ నేతలపై వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వీ.సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ... ఇదివరకు చంద్రబాబు అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ సాకుగా చూపి సానుభూతి పొందే ప్రయత్నం చేసిందని, కానీ అప్పుడు ఆ పార్టీ విఫలమైందన్నారు. ఇప్పుడు చంద్రబాబు అనారోగ్యాన్ని కూడా సింపతీ కోసం వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.