ఓ కేసు విచారణ సందర్భంగా భారత న్యాయపరమైన పూర్వాపరాలను ప్రస్తావించిన లాయర్‌ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖాజీ ఫేజ్ ఇసా మందలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా స్పష్టంగా ఆగ్రహంతో భారతీయ చట్టం పట్ల శాశ్వతమైన మోహాన్ని ప్రశ్నించిన జస్టిస్ ఇసా.. ప్రత్యేకించి ఈ భావన పరస్పరం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు పనితీరుపై వాదనల సందర్భంగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఓ కేసును ఒక న్యాయవాది ప్రస్తావించినప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘మన సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలని’ న్యాయవాదిని జస్టిస్ ఇసా కోరారు. ‘మనం 1947లో స్వతంత్రులమయ్యాం... ఇతర దేశాల నుంచి అన్ని విధాలుగా నేర్చుకోవచ్చు.. కానీ మేము భారతీయ తీర్పులను ఉదాహరణంగా సూచిస్తున్నప్పుడు.. ఆ దేశం పరస్పరం ప్రతిస్పందించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.. మీరు భారత సుప్రీంకోర్టు తీర్పు లేదా హైకోర్టు తీర్పును చూశారా? పాకిస్థాన్ తీర్పును ఎప్పుడైనా ప్రస్తావించారా?’ అని అని పాక్ సుప్రీంకోర్టు సీజే ఘాటు వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
‘కొన్ని చాలా ప్రారంభమైనవి ఉన్నాయని నేను భావిస్తున్నాను.. కానీ పూర్తిగా లేదని కాదు’ అని న్యాయవాది బదులిచ్చారు. ఈ సమయంలో జస్టిస్ ఖాజీ జోక్యం చేసుకుంటూ.. ‘సరిహద్దులో జరిగే ఈ శాశ్వత ఆకర్షణ.. మనం మన రాజ్యాంగానికి ఎందుకు కట్టుబడి ఉండలేకపోతున్నాం? వారి రాజ్యాంగంతో వారు ఏమి చేశారో మేము చూశాం... దానిని ఉత్తమమైన వాటికి బెంచ్‌మార్క్‌గా ఉంచవద్దు.. ప్రపంచంలో ఏమి జరుగుతున్నా మన స్వంత విషయాలకు కట్టుబడి ఉందాం’అని మండిపడ్డారు. అలాగే, ఇస్లాం వైపు ఎందుకు చూడటం లేదని న్యాయవాదిని జస్టిస్ ఇసా ప్రశ్నించారు. ‘అది కార్పెట్ కింద తొక్కివేయబడింది.. అందుకే మనం భారతదేశం వైపు, అమెరికా వైపు చూస్తున్నాం’ అని లాయర్ బదులిచ్చారు.
పాక్ పత్రిక డాన్ ప్రకారం.. సుమోటా, రాజ్యాంగపరమైన విషయాల కోసం సీనియర్ న్యాయమూర్తుల కమిటీ ధర్మాసనాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందన్న సుప్రీంకోర్టు (ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్) చట్టం 2023 రాజ్యాంగబద్దమైందని పాక్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లను మెజార్టీ తీర్పుతో తిరస్కరించింది.