ఓ వ్యక్తి 28 ఏళ్ల పోరాటం ఫలితంగా 50 ఏళ్లకు ఉద్యోగం దక్కింది. UPకి చెందిన అంకుర్ గుప్తా 1995లో పోస్టల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. 15 రోజుల ట్రైనింగ్ తర్వాత అంకుల్తో పాటు మరికొందరిని అనర్హులుగా ప్రకటిస్తూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించగా సానుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తపాల శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అంకుర్ కు ఉద్యోగం ఇవ్వాలని తాజాగా ఆదేశించింది.