దసరాకు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 19, 26 తేదీల్లో ప్రత్యేక రైలు కాకినాడకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి 20, 28 తేదీల్లో కాకినాడ నుంచి కాచిగూడకు చేరుకుంటుందని వెల్లడించారు. మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట్ల స్టేషన్లలో రైలు ఆగనున్నట్లు తెలిపారు.