వచ్చే నెలలో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ పోలింగ్ కేంద్రం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన భరత్పుర సోన్హాత్లోని శేరాడాండ్ గ్రామంలో కేవలం ఐదుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో మొత్తం 11 మంది ఉండగా ఐదుగురికి మాత్రమే ఓటు హక్కు ఉంది. కాగా, ఛత్తీస్గఢ్ నవంబర్ 7, 17న పోలింగ్ జరగనుంది.