కుప్పం మున్సిపాలిటీలోని ఓ దుకాణాదారుడి ఖాతాకు పాన్ కార్డు అనుసంధానం చేయాలంటూ గత మూడు రోజులుగా సెల్ ఫోనుకు మెసేజ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ అప్డేట్ చేయకపోతే ఖాతా బ్లాక్ అవుతుందని మెసేజ్ రావటంతో శనివారం లింకుపై వ్యాపారి క్లిక్ చేశాడు. దీంతో అతని ఖాతాలో రెండు సార్లు రూ. 10 వేలు చొప్పున నగదు విత్ డ్రా అయ్యిందని గుర్తించిన వ్యాపారి, మోసపోయానని పోలీసులు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు.