కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్ అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్ల అక్రమ సొమ్ము బయటపడటం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంచడానికే ఈ అవినీతి నగదును సిద్ధంచేశారని కర్ణాటక సర్కారుపై వామ పక్షాల పార్టీ నేతలు విమర్శలు చేశారు. బీజేపీ నేత, అశ్వత్ నారాయణ్ రూ.42 కోట్ల డబ్బును కాంగ్రెస్ ఏజెంట్లు అక్రమంగా వసూలు చేశారని వ్యాఖ్యలు చేశారు.