హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని గాజాలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ సైన్యం.. ఆ ప్రాంతంలోని పాలస్తీనా ప్రజలను దక్షిణ రాజాకి వెళ్లమనడంపై WHO ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ గాజా ఆస్పత్రులు రోగులతో నిండాయని.. ఇప్పుడు అక్కడికి మరి కొందరిని తరలిస్తే పరిస్థితులు దారుణంగా మారుతాయని పేర్కొంది. అది వారికి ఉరిశిక్షతో సమానమని.. ఆరోగ్య సమస్యలున్న వారికి చికిత్స ఆలస్యమై ప్రాణాల మీదకు వస్తుందని WHO తెలిపింది.