ల్యాప్ టాప్ దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత్ లో ల్యాప్ టాప్ లు, కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం ఉండదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్వాల్ తెలిపారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఆగస్టులో కేంద్రం పీసీలు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే నవంబరు 1 నుంచి దిగుమతి నిర్వహణ వ్యవస్థ ఒకటి అమలులోకి వస్తుందని తెలిపారు.