గురజాల ఎస్స్ఈబీ పరిధిలో శనివారం అధికారులు దాడులు నిర్వహించారు. దాచేపల్లి మండలం నడికుడి వద్ద అక్రమంగా తెలంగాణ నుంచి మద్యం బాటిళ్లు తీసుకె ళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయరావు తెలిపారు. ఈ దాడుల్లో దాసు, శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.