వరిపైరు పొట్టదశలో ఉందని, ఈ క్రమంలో పొలాలకు నీరందక రైతులు లబోదిబోమంటున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెనాలి మండలంలోని హాఫ్పేట, నంబూరు డొంక కొలకలూరు గ్రామాల్లో ఎండిపోయిన పొలాలను టిడిపి, జనసేన నాయకులతో కలిసి రాజేంద్రప్రసాద్ శనివారం పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ బీడుబారి నెర్రులోచ్చిన పొలాలకు సాగునీరు అందించాలని అధికారులకు ఈనెల 11న కోరామని ఇంకా స్పందించలేదని అన్నారు.