కరెంటు ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు కె. నళినీకాంత్, కె. మాల్యాద్రి అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరశిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం గుంటూరు నగరం గుజ్జనగుండ్ల సెంటర్లో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు.