చంద్రబాబు నాయుడుకు ఏసీ కావాలని టీడీపీవారు నానా యాగీ మొదలుపెట్టారు. ఏసీ కావాలంటున్నవారు భారతదేశంలో జైళ్ళకు సంబంధించిన నిబంధనలు తెలిసి మాట్లాడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. టీడీపీకి లాయర్లు కావాల్సినంతమంది ఉన్నారు. వారందిరికీ జైలు మాన్యువల్ తెలుసు. జైలు మాన్యువల్ ప్రకారం రిమాండ్ ఖైదీలకు కానివ్వండీ, ఖైదీలకు కానివ్వండీ- ఏసీ ఉండదని తెలుసు అన్నారు. ఒకవేళ ఏసీ కావాలంటే, చల్లదనం వల్ల చంద్రబాబుకు డెర్మటాలజీ సమస్యలు తగ్గుతాయనుకుంటే.. ఆ విషయాన్ని చంద్రబాబు లాయర్లు లేదా చంద్రబాబు కుటుంబం మీడియాలో మాట్లాడి, దాన్ని రాజకీయం చేసుకుంటుందా..? లేక, కోర్టు మెట్లు ఎక్కి కోర్టును అడుగుతుందా..? అని ప్రశ్నించారు.