తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, గార మండలం, కొత్తూరు సైరిగాం గ్రామాల్లో మంత్రి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ..తప్పు చేసి కొవ్వొత్తులు పట్టుకుంటే వదలరు. అలా అయితే తప్పుడు పనులు చేసిన అందరూ పెద్ద,పెద్ద దివిటీలు పట్టుకొని బయలదేరుతారు. అవినీతికి పాల్పడితే చట్టం ముందు ఎవ్వరైనా సమానమే. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పాయి. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,ఇన్కం ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ లలో కూడా నిజం అని తేలింది. జర్మన్ కంపెనీ సీమన్స్ కూడా తేల్చి చెప్పింది. మాకు ఆ అగ్రిమెంట్ కూ సంబంధం లేదని. కానీ ఆ పేరుతో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలకు డబ్బులు వెళ్ళాయి అని తేలింది. ఆ డబ్బు చంద్రబాబు,లోకేశ్ పీఏలకు వెళ్ళింది అని తేలింది. వారు ఇద్దరూ దేశం దాటి వెళ్లిపోయారు. వ్యూహాత్మకంగా డబ్బులు తప్పు దారి పట్టాయి. చంద్రబాబు దోషి అవునా,కాదా అన్నది కోర్టు పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం నిందితుడిగా ఉన్నారు. ఇందిరాగాంధీకి, పి.వి.నరసింహారావుకూ, పక్క రాష్ట్రానికి చెందిన జయలలి తకూ, లాలూ ప్రసాద్ యాదవ్ కూ ఇలా అందరికీ ఒకటే చట్టం. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం ముందర అందరూ సమానమే.