శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కలెక్టర్ కార్యాలయం స్పందన గ్రీవెన్స్ హాల్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోనే ప్రజల తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వవచ్చన్నారు.