గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో వెలసిన వాసవీ కన్యాకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించే దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుని సతీమణి దుర్గకుమారిని ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఆహ్వానించారు. ఎమ్మెల్యే అన్నా నివాసంలో ముండ్లపాడు అమ్మవారిశాల ఆలయ కమిటీ సభ్యులు దంపతులను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆలయంలో ఈ నెల 15 నుండి 25వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలను వారికి వివరించారు.