శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనవి. క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు శ్రీశైలం భ్రమరాంబాదేవి నవదుర్గ అలంకారాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు శాస్త్రోక్తంగా అమ్మవారి యగశాల ప్రవేశంతో దసరా ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ సాయంత్రం భ్రమరాంబికాదేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శమివనున్నారు. బృంగివహంపై ఆశీనులై ఆదిదంపతులు పూజలందుకోనున్నారు. క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండువగా శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.