కడప జిల్లా, తంబళ్లపల్లె మండలంలోని జుంజురపెంట పంచాయతీ గంజి కుంటవారిపల్లెలో ఆంత్రాక్స్ వ్యాధితో గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్ళితే...... శుక్రవారం రాత్రి నుంచి మేత మేస్తున్న గొర్రెలు, మేకలు నోట్లో, మూత్రాశయం నుంచి రక్తం కక్కుకొని కింద పడి గిలగిల కొట్టుకుంటూ మృత్యువాత పడుతున్నాయి. దీంతో బాధితులు పశువైద్యాధికారులకు సమాచారం అందించగా కొటాల పశువైద్యులు శనివారం గ్రామాన్ని సందర్శిం చారు. లక్షణాలను బట్టి జీవాలు చనిపోవడానికి ఆంత్రాక్స్ వ్యాధి అయి ఉండవచ్చునని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇటువంటి లక్షణాలు ఆంత్రాక్స్ వ్యాధిలో ఉంటాయని, వ్యాక్సిన కోసం పై అధికారులకు సమాచారం ఇచ్చామని వస్తూనే జీవాలకు వేస్తామన్నారు.