విజయనగరం జిల్లా, ఎస్.బూర్జవలస గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జి కేఏ నాయుడు సమక్షంలో కిక్కర భాస్కరరావు, నిమ్మల దుర్గారావు, బెళ్లాన పైడపునాయుడు, బోని తిరుపతి, బొబ్బిలి సింహాచలం సహా 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. కేఏ నాయుడు పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ, క్లస్టర్ ఇన్చార్జిలు పెద్దింటి జగన్, బెజవాడ బంగారునాయుడు, మజ్జి మహేష్, ఎస్.బూర్జవలస మాజీ సర్పంచ్ పొట్నూరు రమణ, మండల నాయకులు గుసిడి జగన్నాథం, చెల్లూరి సత్యారావు, మంత్రి రామారావు, మరడ రాము తదితరులు పాల్గొన్నారు.