సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాలుగున్నరేళ్ల తరువాత జగన్మోహన్రెడ్డికి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకు వచ్చిందా? అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర అంశాలపై సోమవారం విశాఖ పర్యటనకు రానున్న సీఎంని కలిసి సమగ్రమైన లేఖ ఇవ్వాలని నిర్ణయించాం’’ అని గంటా తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ‘విలాసవంతంగా సీఎం బాత్రూమ్’ అంటూ ఓ ఫొటోను గంటా ప్రదర్శించారు. ఫొటో కింద ‘రుషికొండలో అందరి బిడ్డ కట్టుకున్న పేదోడి బాత్రూమ్’ అని క్యాప్షన్‌ను ఉంచారు.