వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డికు పిచ్చి పరాకాష్టకు చేరిందని, వెంటనే రేబీస్ ఇంజక్షన్ చేయాలని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ..... నారా భువనేశ్వరి ఆవేదనను సజ్జల రామకృష్ణారెడ్డి అవహేళన చేయడం బాధాకరమని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు. జగన్ వద్ద ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ కేసులు పెడుతున్నారని, నలుగురు సీఎంల వద్ద ప్యాకేజీ తీసుకున్న ఘనత ఆయనకే చెల్లుతుందన్నారు.