చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చాల బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తపరిచారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు వయస్సును దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఈ విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని తెలిపారు. ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు.