చంద్రబాబు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయలేమని తెలిసి, భౌతికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ..... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషం. తన జీవితమంతా ప్రజా సేవకే అంకితం చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. డీహైడ్రేషన్‌తో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న చంద్రబాబుకు తక్షణ వైద్యం అందించాలని డాక్టర్లు చెప్తున్నా.. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని చూస్తే.. వారి రాక్షస పోకడలు స్పష్టంగా అర్థమౌతున్నాయి. కక్షలు వీడి మనుషుల్లా ప్రవర్తించండి’’ అని రోహిత్ అన్నారు.