వైసీపీ దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు మాజీ మంత్రి ఆనంద్‌బాబు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్‌రెడ్డి దళితులను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన సబ్‌ప్లాన్ నిధులు సైతం దారిమళ్లించి ఎస్సీలకు తీరని ద్రోహం చేస్తున్నారు. దళితులపై అఘాయిత్యాలు, దాడులు, వేధింపులు, హత్యలకు పాల్పడుతున్న నిందితులపై కనీస చర్యలు తీసుకోవట్లేదు. పైగా దళితుల ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ నేతలను ముఖ్యమంత్రే పక్కన పెట్టుకుంటున్నాడు. దళితులపై సాగిస్తున్న దమనకాండపై మీరు మౌనంగా చూస్తూ ఉంటడం దుర్మార్గం. దళిత నాయకులపై దాడి చేసి, అక్రమ కేసులు పెడుతున్నా.. మీరు నోరు విప్పకుండా మౌనంగా ఉంటూ, ద్రోహులుగా నిలిచిపోతున్నారు. మీ జాతి ప్రయోజనాలు కావాలన్నా.. ఆత్మ గౌరవంతో బతకాలన్నా.. వెంటనే వైసీపీకి రాజీనామా చేయాలి’’ అని ఆనంద్‌బాబు తన లేఖలో కోరారు.