చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయి అని మంత్రి అంబటి రాంబాబు వాపోయారు. అయన మాట్లాడుతూ... చంద్రబాబుకి ప్రాణాపాయం ఉందని.. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని.. 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే నోటికొచ్చిన అబద్దాలు చెప్పారు. దురుద్దేశంతో క్రూరంగా చంద్రబాబు ఆహారంలో స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు ఆహారం పంపుతోంది ఆయన కుటుంబ సభ్యులే. దీనికి సీఎం జగన్ మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని విషపూరిత ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా.. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు. టీడీపీలో యనమల రామకృష్ణుడు చాలా సీనియర్. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఇంకా తగ్గితే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని యనమల అంటారు. చంద్రబాబు జైలులోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఇప్పుడు 67 కేజీలు బరువు ఉన్నారని జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు బరువు తగ్గితే 61 కేజీలు ఉండాలి గానీ .. ఇప్పుడు 67 కేజీలు ఎలా ఉన్నారు..? అని ప్రశ్నించారు.