పొత్తులో భాగంగా జనసేన పార్టీతో సమన్వయం కోసం తెలుగుదేశం పార్టీ ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అచ్చన్నాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా నియమితులయ్యారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన, టీడీపీ మధ్య సమన్వయం కోసం ఈ కమిటీ పని చేస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటించింది.