పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం దసరా ఉత్సవాల సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. విద్యుత్ దీపాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఆలయం దేదీప్యమానంగా నేడు అమ్మవారు పార్వతీ దేవి అలంకరణలో భక్తులను కటాక్షిస్తారని ఈవో చంద్రమౌళి తెలిపారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేశామని ఆయన తెలియజేశారు.