పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అమ్మవారిని పార్వతీదేవి అలంకరణలో ముస్తాబు చేశారు. మూలస్థానం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.