పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 5 నెలల బాలుడి గొంతులో ఇరుక్కొన్న పిన్నీసును వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. హుగ్లీలోని జంగిపార ప్రాంతానికి చెందిన ఓ బాలుడు పిన్నీసు మింగేశాడు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తగా బాబును తల్లిదండ్రులు గురువారం కలకత్తా వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈఎన్‌టీ విభాగం వైద్యుడు సుదీప్‌దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్లు శస్త్రచికిత్స చేసి పిన్నీసును తొలగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa