ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు సోమవారం ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం ఇచ్చారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య హంస వాహన సేవ జరగనుంది. కాగా, భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.