చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ నాగరాజ రెడ్డితో పాటు 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఈవో చంద్రమౌళి వారి చేత ప్రమాణం చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa