వేటపాలెం అనుమల్లి పేటలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు మందిరం వద్ద శరన్నవరాత్రుల్లో భాగంగా 55 సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉద్యానవన తోటలు, ఫల సాయంతో కూడినటువంటి చెట్లు చక్కటి వాతావరణం గల ఆనుమల్లి పేటలో ఆనాటి పెద్దలు అప్పటి మహిళల ఉత్సాహానికి తగ్గట్టుగా బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. అదే ఆనవాయితీ కొనసాగుతూ సోమవారం ఈ వేడుకలు 56వ ఏట ప్రవేశించాయి.