ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 1కి వాయిదా పడిన అసైన్డ్ భూముల కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 03:34 PM

అమరావతిలోని అసైన్డ్ భూముల జీవోపై సీఐడీ దాఖలు చేసిన కేసులో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిని హైకోర్టు తీర్పు కోసం వాయిదా వేసింది. మళ్లీ సీఐడీ తరపున న్యాయవాదులు రీ ఓపెనింగ్ పిటీషన్ దాఖలు చేశారు. తమ వద్ద ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని వాటిని దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. వేరే కేసులో ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని న్యాయవాదులు ప్రశ్నించారు. వాదనలు పూర్తయ్యి, కేస్ తీర్పు ఇవ్వబోతున్న తరుణంలో ఈ పిటీషన్‌పై విచారణకు తమకు అభ్యంతరంగా ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa