నీరు లేక రైతులు నానాకష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంకు పరిపాలనపై అవగాహన లేదన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు కుదేలైపోయాయని తెలిపారు. కృష్ణా డెల్టాలో పంటలు పండిస్తున్న రైతులకి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్ళాలో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రైతు సమస్యలపై జనసేన, టీడీపీతో కలిసి పోరాడబోతుందని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa