టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకి నిరసనగా విశాఖలో నల్ల బెలూన్లు ఎగురవేత కార్యక్రమానికి గంట శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే వినతిపత్రాలు తీసుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. జగన్ విశాఖ పర్యటనలో అవేమీ లేవని.. పైగా ప్రతపక్షాలను నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa