ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నాయకులూ గిరిజనుల సంపదని దోచుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 10:12 AM

ఉత్తరాంధ్రలో గిరిజనుల సంపదను దోచుకోవటానికే జగన్‌రెడ్డి విశాఖ పరిపాలనా రాజధాని అంటున్నారని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ధారునాయక్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘విశాఖ రాజధాని పేరుతో తన బినామీల ద్వారా గిరిజనుల సందపను కొల్లగొట్టడానికి సిద్ధమయ్యారు. గిరిజనుల భూములను పంప్డ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల పేరుతో తన బినామీలకు పంచిపెట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ఏజెన్సీ పరిధిని కుదించే కుట్ర జరుగుతోంది. ఏజెన్సీలో కొండ ప్రాంతాలకు 108 అంబులెన్స్‌ల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు. ఏజెన్సీ గంజాయి హబ్‌గా మార్చి, గిరిజన యువత భవిష్యత్‌ను వైసీపీ నేతలు దెబ్బతీశారు. సీఎంగా పదవి చేపట్టి 52 నెలలు గడిచినా.. గిరిజనుల సంక్షేమానికి జగన్‌రెడ్డి చేసింది శూన్యం’’ అని ధారునాయక్‌ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com