దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.