పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అఫ్రిదీ చెల్లి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. చెల్లిని చూసేందుకు వెళ్తున్నానని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు గత రాత్రే షాహిద్ ట్వీట్ చేయగా. కొన్ని గంటల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అతని కుటుంబాన్ని శోకసంద్రంలో నింపింది. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని అఫ్రిదీకి అంతా సంతాపం తెలియజేస్తున్నారు.