ఎంటిఎస్ ఉద్యోగుల సమస్యలు సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డికి సోమవారం ఉపాధ్యాయులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జెటిఎఫ్ నాయకులు లాలూసాబ్, చాంద్ బాషా మాట్లాడుతూ 1998 ఎంటిఎస్ ఉపాధ్యాయులకు సర్వీసు 62 ఏళ్లకు పెంచాలని, రెగ్యులర్ చేయాలని కోరారు. దీంతో సమస్యలు సిఎం దృష్టికి తీసుకువెళతానని ఎమ్మేల్యే హామీ ఇచ్చారు.