గుత్తి రైల్వే జీఆర్పీ పరిధిలోని బసినేపల్లితండా గ్రామ సమీపంలో సోమవారం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జిఆర్పీ ఎస్సై నాగప్ప తెలిపారు. మృతుడి వయస్సు 30 ఏళ్లు ఉంటాయని ఆచూకీ కోసం అవసరమైన ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.