గూగుల్ మ్యాప్ రివ్యూ వర్క్ పేరుతో ఓ మహిళ దారుణంగా మోసపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్ రివ్యూ వర్క్ పేరుతో సైబర్ నేరగాడు ఓ మహిళను వలలో వేసుకున్నాడు. పెట్టిన ప్రతి రూపాయికి 40 శాతం లాభం పొందొచ్చన్నారు. దాంతో మహిళ మొదటగా రూ.500 నుంచి స్టార్ట్ చేసి రూ.34,11,792 వరకు పెట్టింది. అయితే డబ్బులు పెట్టాక ఎంతకీ తన మనీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించింది. అనంతరం పోలీసులకు ఆశ్రయించింది.