మహారాష్ట్రలోని పూణెకు చెందిన మహిళను ఆన్లైన్లో హోటల్స్‌లో రేటింగ్స్ ఇవ్వడం ద్వారా అధిక మొత్తంలో ఆర్జించవచ్చన్నారు. దాంతో ఆమె దగ్గరి నుంచి రూ.13 లక్షలు కాజేశారు. ఆన్లైన్లో ఆమెను సంప్రదించిన స్కామర్లు పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ చేశారు. హోటళ్లకు రేటింగ్స్ ఇస్తూ డబ్బు సంపాదించుకోవచ్చన్నారు. ప్రతి రేటింగ్‌కు రూ.150 ఇస్తామన్నారు. ఆమె నమ్మకాన్ని గెలుచుకుని ఆ తర్వాత నిండా మోసం చేశారు.