ప్రజలకు తాగునీరు సరఫరా అయ్యే పైపులైన్ లీకేజిని అరికట్టి సమయానికి నీరు అందించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలోని ఎల్లమ్మ తగ్గు రోడ్డులో 60 ఇంచుల పైపులైన్ లీకేజిని పరిశీలించారు. వెంటనే సిబ్బందిని పురమాయించి మరమ్మత్తులు చేయించి ప్రజలకు తాగునీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని డిఇ రామ్మూర్తిని ఆదేశించారు.