అరేబియా సముద్రంలో భారీ తుఫాన్ ఏర్పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షదీప్ ప్రాంతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల వచ్చే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 21న మధ్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం మారే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలోని ముంబై, పూణె ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.