తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు నగరంలో చేస్తాన్న సంఘీభావ శాంతియుత ర్యాలీకి మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో 40 వాహనాల్లో బయలుదేరారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి నాలుగు మండలాలు అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు తరలి వెళ్లి శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు.