కంకిపాడు టెక్నో స్కూల్ దగ్గర ఆగిన సర్వీస్ రోడ్డు పనులను ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎట్టకేలకు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన ఈసర్వీస్ రోడ్డును కంకిపాడు మెయిన్ రోడ్డును, కొణతనపాడు వద్ద సర్వీస్ రోడ్డును పూర్తి చేయించేందుకు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి దృష్టి సారించారు.ఎట్టకేలకు ఈ సర్వీసు రోడ్డు వెతలు తీరనుండటంతో వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.