ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితులకు అన్యాయం చేసింది చంద్రబాబే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 09:43 AM

చంద్రబాబు హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని, సీఎం వైయ‌స్ జగన్‌ పాలనలో ఎంతో మేలు జరుగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కుటిల కులతత్వం చంద్రబాబుది. దళితులకు మేలు జరగాలని చూసే వ్యక్తి వైయ‌స్ జగన్‌. ఏపీలో పేదరికం తగ్గింది. వైయ‌స్ జగన్ చేసిన సంక్షేమం వలనే ఇది సాధ్యమయ్యింది.  చంద్రబాబులాగ మేము రాజకీయాలను కలుషితం చేయమ‌న్నారు. దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకొని పనిచేస్తాం. వైయ‌స్‌ జగన్ విద్యారంగంలో  విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేద విద్యార్థులు ఐక్య రాజ్యసమితిలో మాట్లాడగలిగార‌ని మంత్రి పేర్కొన్నారు. పేదవాడు పేదవాడుగానే ఉండాలనేది టీడీపీ విధానం అంటూ దుయ్యబట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa