ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేదే సీఎం లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 09:42 AM

 రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా ఆరోగ్యంగా ఉండాల‌న్న‌దే ల‌క్ష్యంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ‌ జీవీఎంసీ పరిధి 59 వ వార్డు నక్క వాని పాలెం లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి , విశాఖ వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త  ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి... ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించార‌ని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa